నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కీలక ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 9231 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ సొసైటీ (TREIRB) ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ పరిధిలో మొత్తం 9,231 పోస్టుల భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, టీచర్, లైబ్రేరియన్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.అర్హతలు, నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియ ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ https://treirb.telangana.gov.in/
పోస్టులు.. ఖాళీల వివరాలు
POSTS | VACANCIES |
లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ | 868 |
జూనియర్ లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్ | 2008 |
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) | 1276 |
లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ | 434 |
ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ | 275 |
డ్రాయింగ్ టీచర్స్/ఆర్ట్ టీచర్స్ | 134 |
క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్/ క్రాఫ్ట్ టీచర్స్ | 92 |
మ్యూజిక్ టీచర్స్ | 124 |
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) | 4020 |
మొత్తం | 9231 |
