డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితా విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు వచ్చే నెల ఒకటి వరకు (4 రోజులు) గడువు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. మెరిట్ జాబితా, పూర్తి వివరాలు mhsrb.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
