HomeJEEcllass 12TS Inter Exams 2023 Tips: తెలంగాణ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. ఈ పది...

TS Inter Exams 2023 Tips: తెలంగాణ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. ఈ పది టిప్స్ పాటిస్తే ఫుల్ మార్క్స్.. తెలుసుకోండి

ఇంటర్.. ప్రతీ విద్యార్థికి అతి ముఖ్యమైన దశ. ఇక్కడ విద్యార్థులు (Students) సాధించే ప్రతిభ ఆధారంగానే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే.. పక్కా ప్రణాళికతో చదివితే ఇంటర్ వార్షిక పరీక్షల్లో (TS Inter Exams 2023) అత్యధిక మార్కులు సాధించడం సులభమేనని అధ్యాపకులు చెబుతున్నారు. ముఖ్యంగా జువాలజీకి (TS Inter Zoology) సంబంధించి ఈ కింది విధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చని వారు సూచిస్తున్నారు.

క్వశ్చన్ పేపర్ ఇలా..
1) జంతుశాస్త్రం లో 60 మార్కులకు గాను 2 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. ఈ పదింటికి పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు ఈ ప్రశ్నలకు ఉంటాయి.
2) 4 మార్కులకు సంబంధించి మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 6 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. మొత్తం 6×4=24 మార్కులు ఉంటాయి.
3) 8 మార్కులకు సంబంధించి 3 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రెండింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 2×8=16 మార్కులు ఉంటాయి.

ముఖ్యమైన పది టిప్స్:
1. విద్యార్థులను ఉన్న మొత్తం సిలబస్ ని చదవడం కంటే 60-70శాతం సిలబస్ ను ఎక్కువసార్లు చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. యావరేజ్ విద్యార్థులు అయితే.. మిగతా ప్రశ్నలను ఛాయిస్ కింద వదిలేయవచ్చు.
2. ఆ చదవాల్సిన సిలబస్ కూడా blue print ప్రకారం చదవాలి. ఎందుకంటే 2 మార్కుల ప్రశ్నలు వచ్చే ఛాప్టర్ల నుంచి నుండి 8 మార్క్స్ ప్రశ్నలు చదివితే ప్రయోజనం ఉండదు.
3. ద్వితీయ సంవత్సర విద్యార్థులు 8మార్క్స్ కోసం కేవలం 3 ఛాప్టర్లు చదివితే సరిపోతుంది. అవి:
 I.Body fluids and circulation
II.Human reproductive system
III.Genetics.
వీటిని పర్ఫెక్ట్ గా చదివితే ఎనిమిది మార్కుల ప్రశ్నల విభాగంలో ఫుల్ మార్క్స్ సాధించవచ్చు.

4. ఇంకా.. ప్రథమ సంవత్సర విద్యార్థులు 8 మార్కుల ప్రశ్నల కోసం 3 ఛాప్టర్స్ చదవాల్సి ఉంటుంది. అవి:
I.Biology in human welfare
II.ecology and environment
III.periplaneta americana.
వీటిని పర్ఫెక్ట్ గా చదివితే ఆ విభాగంలో ఫుల్ స్కోర్ చేయవచ్చు.

5. ఇంకా పరీక్ష రాసే సమయంలో డయాగ్రామ్స్ ఉన్న ప్రశ్నలు రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా 8 మార్కుల ప్రశ్నలకు.

6. మంచిగా చదివే విద్యార్థులకు కూడా 60 కి 60 రాకుండా మిస్ కావడానికి కారణం 2 మార్కుల ప్రశ్నలే. ఎందుకంటే 8 మార్కుల ప్రశ్నల కోసం దాదాపు 10 ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నల కోసం 40-50 ప్రశ్నలు చదవాల్సి ఉండగా.. 2 మార్కులకు సంబంధించి మాత్రం 100 ప్రశ్నల వరకు చదవాల్సి ఉంటది. అన్ని ప్రశ్నలు చదవలేక.. చదివినా గుర్తుంచుకోలేక మార్క్స్ ఇక్కడ మిస్ చేసుకుంటారు విద్యార్థులు.


7.దీన్ని అధిగమించడానికి వాటిని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి
8. ఎక్కువ మోడల్ పేపర్స్ ను సాల్వ్ చేసి చెక్ చేసుకోవాలి.

9. 4 మార్కుల కోసం ముందుగా ఈజీ క్వశ్చన్స్ ఉండే ఛాప్టర్లు చదువుకోవాలి.
10. చదువులో వెనకబడిన విద్యార్థులు టెక్ట్స్ బుక్స్ కాకుండా.. సింపుల్ గా ఉండే మెటీరియల్ ను అధ్యాపకులు, సీనియర్లు, లేదా ఇతర విద్యార్థుల సాయంతో కలెక్ట్ చేసుకుని చదువుకోవాలి.
**వెనుబడిన విద్యార్థులు ఎక్కువ ప్రశ్నలు చదువుకోవడం కంటే ముఖ్యమైన ప్రశ్నలు అనేక సార్లు చదవడం బెటర్.

NEET, EAMCET కు ఇలా..
అయితే NEET, EAMCETకు మాత్రం ప్రతీ ఛాప్టర్ ను క్షుణ్ణంగా చదవాల్సిందే. దీనికి గాను విద్యార్దులు మొదటగా మన state akademy text bookను చదవాలి. తర్వాత NCERT text book (NEET కి ఇదే ప్రామాణికం కాబట్టి) చదవాలి. ఆ తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఒక్కో ఛాప్టర్ చదువుతూ మొత్తం సిలబస్ ను పూర్తి చేయాలి.

రచయిత
భూతం రవీందర్, M.Sc, B.Ed.
జువాలజీ సీనియర్ అధ్యాపకులు

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!