సీడీపీవో, ఏసీడీపీవో పోస్టులకు సంబంధించిన తాజా అప్డేట్స్ను తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) రిలీజ్ చేసింది. మహిళా అబివృద్ధి శిశు సంక్షేమ విభాగం (women development and child welfare department, ICDS) 23 ఏసీడీపీవో పోస్టుల భర్తీకి అప్లికేషన్ల గడువు అక్టోబర్ 10వ తేదీతోనే ముగిసింది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇటీవలే ఎడిట్ ఆఫ్షన్ కూడా ఇచ్చింది. జనవరి లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది.
2023 జనవరి 3వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తేదీలను ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీసీఎస్సీ ఈ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొత్తం 23 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు పోటీ ఎక్కువగా ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. తాజాగా టీఎస్పీఎస్సీ జారీ చేసిన ప్రకటన ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాం.
CLICK HERE FOR TSPSC DETAILED NOTIFICATION FOR ACDPO (23 POSTS) RECRUITMENT