సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 20 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరించనున్నట్లు డైరెక్టర్ ఎన్. బలరామ్ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు డిగ్రీలో కంప్యూటర్స్/ ఐ.టి. ఒక సబెక్టుగా ఉన్న వారు లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్స్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు విధిగా పాసై ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు, ఎస్.సి, ఎస్.టి., బి.సి. లకు5 సంవత్సరాల మినహాయింపు ఉంది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం లోకల్ అభ్యర్థులకు అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
మిగిలిన 5 శాతం పోస్టులు అన్ రిజర్వుడు కోటాకింద ఓపెన్ టు ఆల్ (అందరికీ అవకాశంగా) తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేపడుతారు.
దరఖాస్తులు; ఈ నెల 20వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా
తుది గడువు; జులై 10 తేదీ
నోటిఫికేషన్ పూర్తి వివరాలు సింగరేణి వెబ్సైట్ www.scclmines.com లో అందుబాటులో ఉన్నాయి.

Police conistabul, maths , questions & explation, send sir
Ok
Maths Explanation and ask the question sir
Sir i want question in English sir
Superb
Hii