HomeJOBSసింగరేణిలో 177 క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్‌

సింగరేణిలో 177 క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్‌

సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (క్లర్క్​) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ నెల 20 నుండి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తుల స్వీకరించనున్నట్లు డైరెక్టర్‌ ఎన్‌. బలరామ్‌ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు డిగ్రీలో కంప్యూటర్స్‌/ ఐ.టి. ఒక సబెక్టుగా ఉన్న వారు లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌ డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్‌ కోర్సు విధిగా పాసై ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు, ఎస్‌.సి, ఎస్‌.టి., బి.సి. లకు5 సంవత్సరాల మినహాయింపు ఉంది.

Advertisement

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం లోకల్‌ అభ్యర్థులకు అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, అదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
మిగిలిన 5 శాతం పోస్టులు అన్‌ రిజర్వుడు కోటాకింద ఓపెన్‌ టు ఆల్‌ (అందరికీ అవకాశంగా) తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
రాత పరీక్షలో మెరిట్​ ఆధారంగా సెలెక్షన్​ చేపడుతారు.
దరఖాస్తులు; ఈ నెల 20వ తేదీ నుండి ఆన్‌ లైన్‌ ద్వారా
తుది గడువు; జులై 10 తేదీ
నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు సింగరేణి వెబ్​సైట్​ www.scclmines.com లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

RECENT POSTS

6 COMMENTS

  1. Police conistabul, maths , questions & explation, send sir

  2. Ok

  3. Maths Explanation and ask the question sir

  4. Sir i want question in English sir

  5. Shivakumar Uppuleti

    Superb

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!