యాదగిరిగుట్ట టెంపుల్ డెవెలప్మెంట్ అథారిటీ (YTDA) అధ్వర్యంలో యాదాద్రిలో శిల్ప కళ, వాస్తు శిల్ప నైపుణ్య సంస్థ (sculpture institute)ను నెలకొల్పింది. ఇందులో మూడేండ్ల కాల వ్యవధితో శిల్పం, వాస్తు శిల్పం డిగ్రీ కోర్సును 3 years Degree course in sculpture and architecture నిర్వహించనుంది. హైదరాబాద్ జేఎన్టీయూ అఫిలియేషన్తో ఈ ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వైటీడీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది నుంచే కోర్సు ప్రారంభమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధ్వర్యంలో తిరుపతి, మహబలిపురంలో నిర్వహిస్తున్న తరహాలోనే ఈ కోర్సును ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
