యువతలో బ్యాంక్ ఉద్యోగాలకు (Bank Jobs) ఉండే క్రేజే వేరు. ప్రభుత్వ ఉద్యోగాలతో (Government Jobs) సమానంగా ఈ ఉద్యోగాలకు పోటీ ఉంటుంది. తక్కువ ఒత్తిడి, మంచి జీతం, సమాజంలో తగిన గుర్తింపు ఉండడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఇంకా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం SBIలో ఉద్యోగం అంటే.. యువత ఇంకా ఆసక్తి చూపుతారు. అలాంటి నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏకంగా 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది బ్యాంక్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 18 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల నవంబర్ 7ను ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. విద్యార్హత పొందిన తర్వాత అభ్యర్థులు రెండేళ్ల అనుభవం పొంది ఉండాలి. మీరు కూడా డిగ్రీ చేసి ఉంటే ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరీ!
నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ – Link
అప్లికేషన్ డైరెక్ట్ లింక్ – Link
bank sbi