HomeFeaturedBANK EXAMSటెన్త్​తో సెంట్రల్ బ్యాంకులో 484 పోస్టులు

టెన్త్​తో సెంట్రల్ బ్యాంకులో 484 పోస్టులు

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ అహ్వానిస్తోంది.

అర్హత: ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 31 మార్చి 2023 నాటికి 18 -నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం నెలకు రూ.19,500 – రూ.37,815 చెల్లిస్తారు.

సెలెక్షన్​: ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్​ ఇంగ్లీష్​ మీడియంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 21 నుంచి జూన్​ 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష జులై/ ఆగస్టులో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.centralbankofindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!