Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSస్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జాబ్​ క్యాలెండర్​

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జాబ్​ క్యాలెండర్​

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్​ఎస్​సీ) పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. 2024–-25లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ విడుదల చేసింది. దీంట్లో 2024 జూన్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు నిర్వహించే జూనియర్‌ ఇంజినీర్‌, సెలక్షన్‌ పోస్టులు, ఢిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీజీఎల్‌, ఎంటీఎస్‌, హవల్దార్‌, గ్రేడ్‌ సి/డి స్టెనోగ్రాఫర్‌, కానిస్టేబుల్‌ (జీడీ), జూనియర్‌ హిందీ ట్రాన్స్‌టేటర్‌ ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ప్రకటించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, అప్లికేషన్స్​, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది.

పరీక్షల తేదీలు
జూన్‌ 24న సీజీఎల్‌, 27న ఎంటీఎస్‌, ఆగస్టు 27 కానిస్టేబుల్‌ (జీడీ) నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. సెప్టెంబర్‌/ అక్టోబర్‌లో సీజీఎల్‌ పరీక్షలు, అక్టోబర్‌/ నవంబర్‌లో ఎంటీఎస్‌ పరీక్షలు, వచ్చే ఏడాది జనవరి/ ఫిబ్రవరిలో కానిస్టేబుల్‌ (జీడీ) రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!