నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది నార్త్ ఈస్ట్రన్ రైల్వేస్. 1104 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత, ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు (వర్క్‌షాప్/ యూనిట్ల వారీగా)
మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్) – 411
సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) – 63
బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) – 35
మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్) – 151
డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్) – 60
క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్) – 64
క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్) – 155
డీజిల్ షెడ్ (గోండా) – 23
క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి) -75
మొత్తం పోస్టులు – 1104
ట్రేడ్స్: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, పెయింటర్, మెషినిస్ట్
అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పదోతరగతి , సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు:
అభ్యర్థులు 2024 జూన్ 12 నాటికి 15ఏండ్ల నుంచి 24ఏండ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ 100 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ట్రైనింగ్ పీరియడ్:
యాక్ట్ అప్రెంటీస్ పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాది ట్రైనింగ్ ఉంటుంది.
ఎంపిక విధానం:
పదోతరగతి, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణ తేదీ జూన్ 12, 2024
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జులై 11, 2024