హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో అప్రెంటిస్ ఖాళీల ప్రకటన వెలువడింది. హైదరాబాద్ లోని బాలానగర్‌లోని హెచ్‌ఏఎల్ లో ఈ అప్రెంటిస్ శిక్షణను అందిస్తారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్‌కు అర్హులవుతారు. ఎంపికైన వారికి శిక్షణ సమయంలో ప్రతినెలా స్టైఫండ్ చెల్లిస్తారు.
ట్రేడ్ అప్రెంటిస్: 178 ఖాళీలు
ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, సీవోపీఏ, ప్లంబర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్‌మ్యాన్- సివిల్, డ్రాప్ట్స్‌మ్యాన్- మెకానికల్.
అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
రిజిస్ట్రేషన్లు: ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ ఫామ్ కాపీని వాక్ ఇన్ ఇంటర్వ్యూ రోజున అందజేయాల్సి ఉంటుంది.
వాక్ ఇన్ తేదీలు: మే 17, 18, 19 తేదీల్లో అభ్యర్థులు నేరుగా తమ సర్టిఫికెట్లతో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సి ఉంటుంది.
వాక్ ఇన్ సెంటర్: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆడిటోరియం, హెచ్‌ఏఎల్, బాలానగర్, హైదరాబాద్.

