HomeLATESTఐఐటీ మద్రాస్​లో సమ్మర్​​ ఫెలోషిప్​

ఐఐటీ మద్రాస్​లో సమ్మర్​​ ఫెలోషిప్​

ఇంజినీరింగ్​, మేనేజ్​మెంట్​ సైన్సెస్​, హ్యూమానిటీస్​ విభాగాల్లో పరిశోధనపై యువతకు ఆసక్తి కలిగించేందుకు మద్రాస్​ ఐఐటీ రెండు నెలల వ్యవధితో సమ్మర్​ ఫెలోషిప్​ ప్రోగ్రామ్​ను అందిస్తోంది. అకడమిక్​ మెరిట్​, సెమినార్​లో పేపర్​ ప్రజెంటేషన్​ ఇచ్చినవారికి, ప్రాజెక్ట్​ వర్కులు చేసిన వారికి, జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి ప్రాధాన్య ఇస్తారు. సెలెక్టయిన వారికి భోజనం, వసతితో పాటు రూ.6వేల స్టైఫెండ్​ అందజేస్తారు.

Advertisement

ఎలిజిబులిటి

బీఈ,బీటెక్​, బీఎస్సీ ఫైనల్​ ఇయర్​ స్టూడెంట్స్​, ఇంటిగ్రేటెడ్​ ఎంఈ, ఎంటెక్​ ప్రోగ్రామ్​లలో థర్డ్​, ఫోర్త్​ ఇయర్​ చదువుతున్న స్టూడెంట్స్​, ఎంఈ/ఎంటెక్​/ఎమ్మెస్సీ/ఎంఏ/ ఎంబీఎ ఫస్ట్​ ఇయర్​ చదువుతున్న స్టూడెంట్స్​ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఐటీల్లో చదువుతున్న స్టూడెంట్స్​ అనర్హులు.

సమ్మర్​ ఫెలోషిప్​లో భాగంగా ఏరోస్పేస్​, అప్లయిడ్​ మెకానిక్స్​, బయో టెక్నాలజీ, కెమికల్​, సివిల్​, కంప్యూటర్​ సైన్స్​, ఇంజినీరింగ్​ డిజైన్​, ఎలక్ట్రికల్​, మెకానికల్​, మెటలర్జికల్​ అండ్ మెటీరియల్స్​, ఓషన్​ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్స్​లో సైన్స్​ డిపార్ట్​మెంట్లలో అయితే ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మేథమేటిక్స్​, హ్యూమానిటీస్​ అండ్​ సోషల్​ సైన్సెస్​, మేనేజ్​మెంట్​ స్టడీస్​లో పార్టిసిపేట్​ చేయవచ్చు.

Advertisement

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా ఏప్రిల్​ 06వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. మే 23 నుంచి జూలై 22 వరకు రెండు నెలల పాటు ప్రోగ్రామ్​ను నిర్వహిస్తారు.

వెబ్​సైట్​ : www.sfp.iitm.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!