ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ సైన్సెస్, హ్యూమానిటీస్ విభాగాల్లో పరిశోధనపై యువతకు ఆసక్తి కలిగించేందుకు మద్రాస్ ఐఐటీ రెండు నెలల వ్యవధితో సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అకడమిక్ మెరిట్, సెమినార్లో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చినవారికి, ప్రాజెక్ట్ వర్కులు చేసిన వారికి, జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి ప్రాధాన్య ఇస్తారు. సెలెక్టయిన వారికి భోజనం, వసతితో పాటు రూ.6వేల స్టైఫెండ్ అందజేస్తారు.
ఎలిజిబులిటి
బీఈ,బీటెక్, బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్ ప్రోగ్రామ్‌లలో థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ/ఎంఏ/ ఎంబీఎ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఐటీల్లో చదువుతున్న స్టూడెంట్స్ అనర్హులు.
సమ్మర్ ఫెలోషిప్‌లో భాగంగా ఏరోస్పేస్, అప్లయిడ్ మెకానిక్స్, బయో టెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ డిజైన్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, ఓషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్లో సైన్స్ డిపార్ట్మెంట్లలో అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ స్టడీస్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 06వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. మే 23 నుంచి జూలై 22 వరకు రెండు నెలల పాటు ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు.
వెబ్సైట్ : www.sfp.iitm.ac.in