HomeLATESTమల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్​ పోస్టులకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్​

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్​ పోస్టులకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్​

భార‌త ప్రభుత్వ ప‌ర్సన‌ల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ ప‌ర్సన‌ల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ) మల్టీటాస్కింగ్​ (నాన్​ టెక్నికల్​), హవల్దార్​ (సీబీఐసీ అండ్​ సీబీఎన్​) స్టాఫ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్ 4వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

Advertisement

పోస్టులు: 1) మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (నాన్‌ – టెక్నికల్‌): ఖాళీల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

2) హవల్దార్‌ (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌): 3603

అర్హత‌: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేష‌న్ (ప‌దో త‌ర‌గ‌తి) ప‌రీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వివిధ విభాగాల‌ను అనుస‌రించి 1 జనవరి 2022 నాటికి 18-నుంచి 25 ఏళ్లు, 18 నుంచి -27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ట వయసులో స‌డ‌లింపు ఉంటుంది.

Advertisement

సెలెక్షన్​ ప్రాసెస్​: క‌ంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష (పేప‌ర్‌-1, పేప‌ర్‌-2), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామ్​లో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1 ఆబ్జెక్టివ్ టైప్‌, పేప‌ర్‌-2 డిస్క్రిప్టివ్ ప‌ద్ధతిలో ఉంటుంది. పేప‌ర్‌-1 ప‌రీక్షా ప‌ద్ధతి కింది విధంగా ఉంటుంది. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంగ్లిష్​, జనరల్​ ఇంటలీజెన్స్, ఆప్టిట్యూడ్​, జనరల్​ అవేర్​నెస్​ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. ప‌రీక్షా స‌మయం 90 నిమిషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉటుంది.

పేప‌ర్‌-2: ఇది డిస్క్రిప్టివ్ ప‌ద్ధతిలో 50 మార్కుల‌కు ఉంటుంది. షార్ట్ ఎస్సే/ లెట‌ర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. ప‌రీక్షా సమ‌యం 45 నిమిషాలు కేటాయిస్తారు.

అప్లికేషన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్​ 30వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఆన్​లైన్​లో ఫీజు చెల్లించడానికి మే 2వ తేదీ వరకు సమయం ఉంది. కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్ (టైర్‌-1) పరీక్ష జులైలో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.ssc.nic.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!