తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లతో పాటు మోడల్ పేపర్లను ఎస్ఎస్సీ బోర్డు రిలీజ్ చేసింది. తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి ( TS Tenth Class Exams) పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను ఎస్ఎస్సీ బోర్డు (TELANGANA BOARD OF SECONDARY EDUCATION) శుక్రవారమే విడుదల చేసింది. హాల్ టికెట్లను ఎస్ ఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ జిల్లా, పాఠశాల పేరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.
హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సిన డైరెక్ట్ లింక్ www.bse.telangana.gov.in
ఈ హాల్ టికెట్లపై హెడ్ మాస్టర్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తామని ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక రోజు ముందే తమ పరీక్షా కేంద్రానికి వెళ్లి అడ్రస్ సరి చూసుకోవాలని సూచించింది. విద్యార్థులు తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 9030282993 కు ఫోన్ చేయాలని కోరింది.
పరీక్షల టైంటేబుల్
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 4 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | ఇంగ్లిష్, |
ఏప్రిల్ 8 | మ్యాథ్స్ |
ఏప్రిల్ 10 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 11 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 12 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, |
ఏప్రిల్ 13 | ఓరియంటెల్ పేపర్-2 |
ఏడాది ఏప్రిల్ 3న పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే సైన్స్ పరీక్షను మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ సారి పదో తరగతి పరీక్షల్లో అబ్జక్టివ్ పేపర్ (మల్టీపుల్ చాయిస్ ప్రశ్నాపత్రం) రాసేందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. గతంలో ఈ పేపర్‌కు 30 నిమిషాల సమయం ఉండేది.
మోడల్ పేపర్లు 2023
ఈ ఏడాది (2023) సిలబస్, ప్రశ్నాపత్రం మోడల్‌కు అనుగుణంగా తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు మోడల్ పేపర్లను విడుదల చేసింది. విద్యార్థుల ప్రాక్టీస్‌కు వీలుగా ఉండేలా సబ్జెక్ట్ ల వారీగా ఈ మోడల్ పేపర్లను ఇక్కడ అందిస్తున్నాం. పీడీఎఫ్ రూపంలో ఉన్న ఈ మోడల్ పేపర్లను విద్యార్థులు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
>> భౌతిక శాస్త్రం (PHYSICAL SCIENCE)
>> జీవ శాస్త్రం (BIOLOGICAL SCIENCE)