టీఎస్పీఎస్సీ (TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ సంక్షేమ విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్న 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన టీఎస్పీఎస్సీ వీటిని భర్తీ చేయనుంది. జనవరి 6వ తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం సాయంత్రం ప్రకటన జారీ చేసింది. అందులో విభాగాల వారీగా ఖాళీల వివరాలను పొందుపరిచింది. గ్రేడ్ వన్ వార్డెన్, గ్రేడ్ టూ వార్డెన్ తో పాటు గ్రేడ్ వన్, గ్రేడ్ 2 మాట్రన్చ లేడీ సూపరింటెండెంట్ పోస్టులు ఇందులో ఉన్నాయి. పూర్తి ప్రకటన యథాతథంగా అందిస్తున్నాం. డిటైయిల్డ్ నోటిఫికేషన్ త్వరలోనే టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో https://websitenew.tspsc.gov.in/అందుబాటులో ఉంచనుంది.
