గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ విడుదలైంది. అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వచ్చాయో అంచనాకు వచ్చేశారు. పరీక్షలో మెయిన్స్‌కు క్వాలిఫై కావాలంటే.. ఎన్ని మార్కులు రావాలి. ఈసారి టీఎస్పీఎస్సీ అనుసరించిన నిబంధనల ప్రకారం జనరల్‌గా కటాఫ్ మార్కు అందరికీ ఒకేలా ఉండదు.
కేటగిరీ వారీగా ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్ ఎంపిక చేస్తామని ఇప్పటికే టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్‌కు సెలెక్టయ్యే జాబితాలో ఉండే ఛాన్స్ ఉందనే అంచనాలను నిపుణులు.. తలో రకంగా విశ్లేషిస్తున్నారు.
వివిధ కోచింగ్ సెంటర్లు రూపొందించిన అంచనాల ప్రకారం ఓపెన్ కేటగిరీలో 64 నుంచి 65 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలున్నాయి. కేటగిరీ వారీగా ఈ కటాఫ్ తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ఎస్టీ కేటగిరీలో 35 నుంచి 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారని అంచనాగా చెబుతున్నారు. ఏయే కేటగిరీలో.. ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్‌కు క్వాలిఫై అవుతారనేది.. కోచింగ్ సెంటర్లు, వివిధ సబ్జెక్టు నిపుణులు తయారు చేసిన జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
(NOTE: ఇవన్నీ అంచనాలు మాత్రమే.)


