HomeLATESTటెట్​ రిజల్ట్ 2023.. చెక్​ చేసుకొండి

టెట్​ రిజల్ట్ 2023.. చెక్​ చేసుకొండి

తెలంగాణ టెట్​ (TSTET) రిజల్ట్ కాసేపట్లో విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబ‌రు 15న‌ టెట్ పరీక్ష జరిగింది. పేపర్-1 పరీక్ష 2,26,744 మంది అభ్యర్థులు రాయగా, 1,89,963 మంది అభ్యర్థులు పేర్​ 2 పరీక్షకు అటెండయ్యారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే 27న ఫలితాలు విడుదల చేయనున్నట్లు టెట్​ కన్వీనర్​ రాధారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో టీచర్ల నియామకాలకు డీఎస్సీ ప్రకటన వెలువడింది. టెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్సీకి అర్హులవుతారు. డీఎస్సీ పరీక్షలో టెట్​ స్కోర్​కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అందుకే టెట్​ రాసిన అభ్యర్థులందరూ ఈ ఫలితాలకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు టీఎస్​టెట్​ అఫిషియల్ వెబ్​సైట్ tstet.cgg.gov.in లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఫలితాలకు సంబంధించిన డైరెక్ట్ లింక్​ ఇక్కడ ఉంది. అభ్యర్థులు రిజల్ట్ చెక్​ చేసుకోవాలంటే ఈ లింక్​ను క్లిక్​ చేయండి.
(NOTE: ఫలితాలు రిలీజ్​ అయిన వెంటనే లింక్​ అప్​డేట్​ అవుతుంది)

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!