గ్రూప్ 1 అభ్యర్థులు తమ అప్లికేషన్లకు ఎడిట్ చేసుకునే గడువును టీఎస్పీఎస్సీ మరింత పొడిగించింది. 28వ తేదీ వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లలో ఏదైనా తప్పులుంటే.. సవరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు వీటిని సవరించుకోవాలని టీఎస్పీఎస్సీ ముందుగా ప్రకటించింది. ఈ గడువును పొడిగించాలని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటన విడుదల చేసింది. అఫిషియల్ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

How to approach plz tell me .Is it true .I want to move forward.