కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించి వస్తున్న వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 28న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కొన్ని ప్రశ్నల గురించి తలెత్తిన గందరగోళం పూర్తిగా నిరాధారమైనదని.. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది. త్వరలోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ విడుదల చేస్తామని.. సబ్జెక్ట్ నిపుణుల కమిటీతో చర్చించి అన్ని విషయాలను పారదర్శకంగా.. న్యాయంగా పరిశీలించటం జరుగుతుందని ప్రకటనలో ప్రస్తావించింది. అభ్యర్థులు తప్పుడు సమాచారం నమ్మవద్దని.. అధికారికంగా బోర్డు విడుదల చేసే ప్రకటనలను మాత్రమే సరైనవిగా పరిగణించాలని సూచించింది. ఆదివారం జరిగిన పరీక్షలో 5 నుంచి 8 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని.. కొన్నింటికీ రెండేసి సమాధానాలుంటే కొన్ని సమాధానాలు లేవని సోషల్మీడియాలో సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో TSLPRB ఈ ప్రకటన విడుదల చేసింది.

Rajkumar
?