TS EAMCET-2023 అగ్రికల్చర్ & మెడిసిన్ (A&M) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మే 10, 11 తేదీల్లో జరిగిన ఆన్ లైన్లో పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు.
విద్యార్థులు తమ ఓఎంఆర్ షీటులను ప్రిలిమినరీ కీతో పాటు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫిషియల్ వెబ్సైట్ https://eamcet.tsche.ac.in లో ప్రిలిమినరీ కీ అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు ఏవైనా అభ్యంతరాలుంటే 14వ తేదీ నుంచి 16వ తేదీలోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
