తెలంగాణ టెన్త్ ఫలితాలు రిలీజ్ కావటంతో సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. మే 25వ తేదీలోగా విద్యార్థులు తమ పాఠశాలల్లోనే ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. లేట్ ఫీజుతో పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
