Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsపోటీ పరీక్షలకు.. ప్రభుత్వ పాలన

పోటీ పరీక్షలకు.. ప్రభుత్వ పాలన

షాడో కేబినెట్‌: పదవిలో ఉన్న కేబినెట్‌కు సమాంతరంగా వాస్తవంగా పనిచేసే మంత్రి వర్గానికి పోటీగా ప్రతిపక్షం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తమ విధానాలను రూపొందిస్తుంది. దీనినే షాడో కేబినెట్‌ అంటారు. ఇంగ్లాండ్‌లో ఈ విధానం అధికంగా కనిపిస్తుంది.

కిచెన్‌ కేబినెట్‌: ఇది అమెరికాకు చెందిన విధానం. అమెరికా అధ్యక్షుడైన ఆండ్రూ జాక్సన్‌ నుంచి ఈ పదం వ్యాప్తిలోకి వచ్చింది.

గిలెటిన్‌: నభలో కాలవ్యవధి లేని కారణంగా వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్లను చర్చించకుండానే ఆమోదించడం

ఫలిబరస్టర్‌: ఇది ప్రతిపక్షాలు అనుసరించే ఒక విధానం. దీని ద్వారా సభలో సుదీర్ష ప్రసంగాలు చేసి ప్రభుత్వ కార్యకలాపాలను విచ్చిన్నం చేయడం ఇందులోని ముఖ్యాంశం.

జెర్రీ మాండరింగ్‌: ఎన్నికల ముందు నియోజక వర్గాలను తనకు అనుకూలంగా అధికార పార్టీ వునర్‌వ్యవన్గీకరించడం.

లాబీయింగ్‌: ఒక బిల్లును లేదా ప్రభుత్వ విధానాన్ని సమర్థించమనో లేదా వ్యతిరేకించమనో శాసనసభ్యులను ్రొద్చలం చేయడాన్ని లాబీయింగ్‌ అంటారు. ఇది అమెరికాలో ఎక్కువగా ఆచరణలో ఉంది.

విప్‌: ఒక పార్లమెంటరీ పార్టీకి చెందిన ముఖ్య నిర్వాహక కార్యదర్శి నభ్యులు పార్టీ ఆదేశాలకు, విధానాలకు అనుగుణంగా చర్చలలో పాల్గొనాలని, ఓటింగ్‌ చేయాలని లేదా వద్దని ఆదేశాలిచ్చే అధికారం ఇతనికే ఉంటుంది. సదరు ఆదేశాలను అదే విధంగా పిలుస్తారు. వీటిని ఉల్లంఘించిన సభ్యుడు క్రమశిక్షణ చర్యలకు గురవుతాడు.

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌: శాననసభ లేదా పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చలు చాలా కాలం కొనసాగుతాయి. ప్రభుత్వం తన కార్యక్రమాల నిర్వహణకు ముందుగానే కొంత మొత్తాన్ని తీసుకొని తరవాత నభ అనుమతిని ఈ విధానంలో పొందుతారు. సాధారణంగా సంవత్సరం మొత్తంలో అంచనా వేసిన వ్యయంలో ఆరో వంతుకు సమానమైన వ్యయాన్నిరెండు నెలల కోసం దీని ద్వారా తీసుకుంటారు. సంప్రదాయాన్ని
అనుసరించి ఓట్​ ఆన్​ అకౌంట్​ను సభ చర్చ లేకుండానే ఆమోదిస్తుంది.

రాజకీయ తటస్థత: సివిల్‌ సర్వీస్‌ సభ్యులు అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారి విధానాలను అమలు చేయాలని ఈ నూత్రం చెబుతుంది. రాజకీయపరమైన ఇష్టాలు అయిష్టాలు లేకుండా సివిల్‌ నర్వీసులు పాలనలో తమ వంతు పాత్ర పోషించాలని ఈ నూత్రం వివరిన్తుంది.

ఉమ్మడి బాధ్యత: మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రులందరూ ఉమ్మడిగా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తారు. మంత్రిమండలి ప్రధానికి బాధ్యత వహిస్తుంది. ప్రధాని రాజీనామా చేస్తే మొత్తం ప్రభుత్వం పడిపోతుంది.

కోశ నిర్వహణ: సమీకరించిన ప్రజా ధనాన్ని భద్రంగా ఉంచడం, వివిధ చెల్లింపులను చేయడం అనే రెండు అంశాలను కలిపి ఈ విధంగా వ్యవహరిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానంగా దీని గుర్తింపునకు కృషి చేన్తుంది.

ఒత్తిడి సంఘాలు: ప్రభుత్వ విధానాలను లేదా నిర్ణయాలను (ప్రభావితం చేసే సంఘాలు ఇవి. అమెరికాలో ఇవి అధికంగా ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, స్త్రీ ఉద్యమకారులు, మేధావులు ఈ కోవలోకే వస్తాయి. పాలనశాఖలపై బయటి నుంచి నియంత్రణ చేసే సంఘాలైన ఇవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి.

వినియోగ బిల్లు: భారత సంఘటిత నిధిపై విధించే అన్ని వ్యయాలతో పాటుగా లోక్‌సభలో ఓటు వేసిన అన్ని రకాల గ్రాంట్లు, డిమాండ్లతో కూడిన బిల్లును వినియోగ బిల్లు అంటారు.

శోత తీర్మానాలు: ప్రభుత్వం నభ ఆమోదం కోరుతూ సమర్పించిన డిమాండ్‌ మొత్తంలో కొంత తగ్గింపును కోరుతూ చేసే ప్రతిపాదన కోత తీర్మానం. ఇలాంటి ప్రతిపాదనలను స్పీకర్​ విచక్షణ మేరకు అనుమతిస్తారు. నిర్లీత సమస్య పట్ల (ప్రభుత్వ దృష్టిని కేంద్రీకరింపజేయడానికి ఇది ఒక సాధనంగా సభ్యులకు ఉపకరిస్తుంది. ఈ తీర్మానాలు ఆమోదించని పక్షంలో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి
ఉంటుంది.

న్యాయపరమైన శాసన నిర్మాణం: ఒక కేనును విచారిస్తున్నప్పుడు న్యాయమూర్తి చేసే ప్రకటన ద్వారా ఏర్పాటయ్యే శాసనాలను ఈ పదం నూచిన్తుంది. నిర్హీత సందర్భంలో అమలులో ఉన్న వివిధ శాననాల అన్వయం మీద ఆధారపడి ఇచ్చిన తీర్పు నుంచి ఉద్భవించిన శాననం ఇది.

విధాన వ్యతిరేక కోత తీర్మానం: ప్రభుత్వం చేసిన డిమాండ్‌ మొత్తాన్ని రూ.1గా చేయాలని కోరుతూ చేసే ఒక కోత తీర్మానం. దీనిలో నిర్ణీత డిమాండ్‌ విధానాన్ని పూర్తిగా తిరస్కరించడమనే సూత్రం ఇమిడి ఉంది.

పొదుపు కోత: ప్రభుత్వం చేసిన డిమాండ్‌ మొత్తాన్ని కొంత మేరకు తగ్గించాలని చేసే ఒక కోత తీర్మానం

లాంఛనప్రాయమైన కోత: నిర్ణీతమైన ఇబ్బందులను ఈ కోత తీర్మానం సందర్భంగా పేర్కొంటారు. ప్రభుత్వ బాధ్యత పరిధిలోని నిర్జీతమైన ఇబ్బందులను, క్లేశాలను వ్యక్తం చేయడానికి ఇది ఒక సాధనం. దీని ద్వారా డిమాండ్‌ మొత్తంలో రూ.100 తగ్గించాలని కోరతారు.

ప్రధాన ప్రతిపాదన: సభ ఆమోదం కోనం సమర్శించే వ్యయం. సంపూర్ణమైన ప్రతిపాదన తీర్మానం, అవిశ్వాస తీర్మానం మొదలైనవి దీనికి ఉదాహరణలు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!