ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీట్ల కేటాయింపు: ఆరో తరగతి (ప్రభుత్వ- 2,970, ప్రైవేటు- 2,255) కి 5,225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు.
అర్హతలు: ఆరో తరగతి అడ్మిషన్స్‌కు విద్యార్థుల వయసు 10 నుంచి-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు13- నుంచి15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్టంగా 25శాతం మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40శాతం మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
దరఖాస్తులు: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 7 నుంచి డిసెంబర్16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. 2024 జనవరి 21న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.exams.nta.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.
Hello