కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల 18వ తేదీన రాజీవ్‌గాంధీ యూత్ క్విజ్ (rajiv gandhi youth quiz) పోటీ నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది.
అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువతీ యువకులందరూ ఈ క్విజ్ పోటీని సద్వినియోగం చేసుకోవాలి. 16 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సున్న వారందరూ ఈ పోటీలకు అర్హులే.
రిజిస్ట్రేషన్ ఉచితం.. ఈజీ
ఈ పోటీలో పాల్గొనాలంటే ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముచ్చటగా మూడే మూడు నిమిషాల్లో పూర్తవుతుంది. ఇది కూడా పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ www.rajivgandhiyouthquiz.com. జూన్ 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు తుది గడువు ఉంది.
అభ్యర్థులు తమ పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ముందుగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే వచ్చే ఓటీపీ ద్వారా మిగతా వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. వెంటనే మీకు పరీక్ష రోల్ నెంబర్ అలాట్ అవుతుంది.
ఏమేం బహుమతులు

ప్రతి నియోజకవర్గంలో 45 మంది విజేతలు బహుమతులు అందుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి మొత్తం 5355 మంది విజేతలుగా ఎంపికవుతారు. కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ మంది.. కొన్ని చోట్ల ఎక్కువ మంది పోటీ పడే అవకాశముంటుంది. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఈ క్విజ్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్పెషల్ ప్రైజ్: | ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించిన మహిళా విజేతకు ఎలక్ట్రిక్ స్కూటీ |
ఫస్ట్ ప్రైజ్: | అత్యధిక మార్కులు సాధించిన విజేతకు ల్యాప్ టాప్ |
సెకండ్ ప్రైజ్: | స్టార్ట్ ఫోన్ |
థర్డ్ ప్రైజ్: | టాబ్లెట్ |
కన్సోలేషన్ బహుమతులు : | మార్కుల మెరిట్ ఆధారంగా వరుసగా మరో 40 మంది విజేతలకు కన్సోలేషన్ బహుమతులు అందిస్తారు. (10 స్టార్ట్ వాచ్‌లు, 10 ఇయర్ పాడ్స్, 10 హార్డ్ డ్రైవ్స్, 10 పవర్ బ్యాంక్స్) |
మొబైల్ నుంచే పరీక్ష రాయొచ్చు
పరీక్ష రాసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన వృథా ప్రయాస ఉండదు. 18వ తేదీన మీకు పంపించిన ఆన్లైన్ లింక్ ద్వారా మొబైల్ లేదా లాప్ టాప్ డెస్క్ టాప్ నుంచి ఈ పరీక్ష అటెండ్ కావాల్సి ఉంటుంది. మొబైల్ లో నెట్ కనెక్టవిటీ ఉంటే సరిపోతుంది. పరీక్షలో కేవలం 60 ప్రశ్నలుంటాయి. 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏమేం ప్రశ్నలుంటాయి
రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ నిర్వహకులు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఈ టాపిక్ల నుంచి ప్రశ్నలుంటాయి.
- General knowledge & Current affairs
- Indian History and Freedom Movement
- History of Telangana and Telangana Movement
- India s Development – Plans & Policies
- General Mental Ability and Logical Reasoning
- (ఈ టాపిక్ లకు సంబంధించి దాదాపు 500కుపైగా ప్రాక్టీస్ టెస్ట్ లు మెరుపులు.కామ్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కేవలం క్విజ్‌ను దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి క్విజ్ ప్రాక్టీస్ టెస్ట్ పేరుతో 17వ తేదీ వరకు డెయిల్ టెస్ట్ లను అందిస్తాం. ఇవన్నీ అభ్యర్థుల ప్రాక్టీస్‌కు తప్పనిసరిగా ఉపయోగపడుతాయి.)
how can i nknow i am a winner