HomeLATESTపేపర్ లీక్ కేస్ లో తండ్రీ కొడుకులు

పేపర్ లీక్ కేస్ లో తండ్రీ కొడుకులు

ఎలాగైనా సరే.. తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగి కావాలనే తండ్రి ఆరాటం అసలుకే ఎసరు తెచ్చింది. ఇప్పుడా ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ జైలు పాలయ్యారు. టీఎస్​పీఎస్​సీ కేసులో తండ్రీ కొడుకులు ఇరుక్కున్నారు. ఇప్పటికే లీకేజీ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు సిట్​ ఈ కేసులో ప్రమేయమున్న 17 మందిని అరెస్ట్ చేసింది. తాజాగా మహబూబ్​నగర్​కు చెందిన తండ్రీ కొడుకులు ఇద్దరినీ అరెస్ట్ చేసింది. దీంతో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది.

మహబూబ్​ నగర్ చెందిన మైసయ్య, జనార్దన్ లను సిట్​ తాజాగా ఈ కేసులో చేర్చింది. మైసయ్య తన కొడుకు కోసం రెండు లక్షల రూపాయలు పెట్టి ఏఈ పేపర్​ కొనుగోలు చేసినట్లు సిట్​ విచారణలో బయట పడింది. డాక్యాకు రెండు లక్షలు ఇచ్చి మైసయ్య ఈ పేపర్​ కొన్నట్లు తేలింది. ఇప్పడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరినీ సిట్​ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!