Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsస్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌… టూర్​ టు మూన్​ అండ్​ మార్స్​.. విశేషాలు

స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌… టూర్​ టు మూన్​ అండ్​ మార్స్​.. విశేషాలు

స్పేన్‌ ఎక్స్‌ SpaceX.. ఆస్ట్రోనాట్లను, స్పేస్‌ టూరిస్టులను చంద్రుడు (moon),
అంగారకుడి (mars) పైకి తీసుకెళ్లేందుకు తయారు చేసిన భారీ రాకెట్​. ఇది అంతరిక్ష యాత్ర వాహనం లాంటిది. దీన్ని మళ్లీ మళ్లీ యూజ్​ చేసేందుకు వీలుగా అభివృద్ధి చేశారు. ఎలాన్‌ మస్క్‌ (Elon musk) కు చెందిన ‘స్పేస్‌ ఎక్స్‌’ కంపెనీ ఈ రాకెట్ ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే ఇది భారీ రాకెట్.

Advertisement

దీని బరువు 5 వేల టన్నులు. రాకెట్​ ఎత్తు 120 మీటర్లు. 100 టన్నుల బరువును ఇది
మోసుకెళ్లగలదు. స్టార్‌షిప్‌ అనేది రీయూజబుల్‌ రాకెట్‌. అంతరిక్ష యాత్రలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేశారు. .

స్టార్‌షిప్‌ తయారీకి స్పేస్‌ఎక్స్‌ కంపెనీ దాదాపు రూ.16వేల కోట్లకుపైనే ఖర్చుచేసింది.

2025లో చంద్రుడిపైకి ఆస్టోనాట్లను పంపేందుకు నాసా(NASA) తలపెట్టిన ఆర్డెమిస్‌ (Artemis) ప్రాజెక్టుకు స్టార్‌ షిప్ రాకెట్​నే నాసా ఉపయోగించనుంది.

Advertisement

స్టార్​ షిప్‌ రాకెట్‌ అభివృద్ధికి నాసా 2021 ఏప్రిల్​లోనే రూ.23 వేల కోట్ల భారీ కాంట్రాక్టును స్పేస్​ ఎక్స్​కు కేటాయించింది.

ఏప్రిల్​ 20వ తేదీన ‘స్టార్‌ షిప్‌’ రాకెట్ ప్రయోగం ఫెయిలైంది. నింగిలోకి దూసుకెళ్లిన
కాసేపటికే పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో బోకాచికా సముద్ర తీరంలో ఉన్న స్పేస్‌ఎక్స్‌ లాంచ్‌ ప్యాడ్‌ నుంచి దీన్ని ప్రయోగించారు.

రాకెట్‌కు అమర్చిన 33 రాష్టర్‌ ఇంజన్లలో 5 పనిచేయకపోవడం వల్లే ప్రయోగం ఫెయిలైందని సైంటిస్టులు తెలిపారు. ఈ రాకెట్‌లో బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌ అనే రెందు ప్రధాన సెక్షన్లు ప్రయోగించిన 3 నిమిషాల్లోగా.
విడిపోవాలి. కానీ అలా జరగకపోవటంతో రాకెట్‌ పేలిపోయింది.

Advertisement

ప్రపంచంలోనే భారీ రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ తొలి ప్రయోగం విఫలమైంది. ప్రయోగ పరీక్ష కావటంతో ఇందులో ఉపగ్రహాలేవీ ఉంచలేదు. ఈ ప్రయోగం నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామని స్పేస్​ ఎక్స్​ యజమాని ఎలెన్​ మాస్క్​ ట్వీట్ చేశారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!