Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఉద్యోగం పోయిందా.. ఇక్కడ వెతుక్కొండి

ఉద్యోగం పోయిందా.. ఇక్కడ వెతుక్కొండి

ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్​ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఉద్యోగాలను కోల్పోయిన వారిని వెతుక్కుంటే స్టార్టప్​ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు.. మేం ఉద్యోగం ఇస్తాం.. అంటూ ప్రకటనలు జారీ ఇస్తున్నాయి. తమ దగ్గర ఉన్న బోలెడు వేకెన్సీలు ఉన్నాయని.. నాలుగు స్టార్టప్​ కంపెనీలు ఉద్యోగుల వేటలో పడ్టాయి. టాలెంట్​ ఉంటే.. ఈ ఉద్యోగాలు మీరూ సొంతం చేసుకోవచ్చు. ట్రై చేయండి. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇటీవల లే ఆఫ్ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలిగించాయి. దీంతో కొత్తగా మళ్లీ ఎక్కడ అప్లై చేసుకోవాలి.. ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఎదురుచూస్తున్న వారి కోసం.. కొన్ని స్టార్టప్​ కంపెనీల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

లైఫ్ రే (LIFE RAY

లైఫ్​ రే కంపెనీ త్వరలోనే బెంగుళూరులో కొత్త బ్రాంచీ ఒపెన్​ చేస్తోంది క్లౌడ్ టెక్నాలజీ, ప్రాడెక్ట్ డెవలప్ మెంట్, ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాల్లో సాఫ్ట్ వేర్ టెక్నాలజీని ఈ కంపెనీ అందిస్తుంది. ఇప్పటికే 19 దేశాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొత్తగా నెలకొల్పే బెంగుళూరు బ్రాంచీలో పని చేసేందుకు 200 మంది ఐటీ ఎంప్లాయిస్​ అవసరమని.. రిక్రూట్​మెంట్​ లో లోకల్​ టెకీలకు ప్రియారిటీ ఇస్తామని ఈ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. దశల వారీగా మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. ఈ కంపెనీలో ఉద్యోగుల వివరాలకు https://www.liferay.com/

ఫిజిక్స్ వాలా Physics Wallah

ఫిజిక్స్​వాలా.. ఇది ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫాం స్టార్టప్ కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో.. కొత్తగా 2,500 మందిని రిక్రూట్ చేసుకుంటామని ఈ కంపెనీ ప్రకటించింది. ఫిజిక్స్ టీచర్లు, విద్యా నిపుణుల కోసం ఈ రిక్రూట్​మెంట్​ మొదలుపెట్టింది. వీరితో పాటు బిజినెస్ అనలిస్టులు, డేటా అనలిస్టులు, కౌన్సెలర్లు, ఆపరేషన్ మేనేజర్ల అవసరం కూడా తమకు ఉందని.. అందరికీ ఆకర్షణీయ వేతనాలు అందిస్తామని ప్రకటించింది. మరిన్ని వివరాలకు https://pwhr.darwinbox.in/ms/candidate/careers

టీఎస్ఏడబ్ల్యూ డ్రోన్స్ TSAW DRONES:

టీఎస్ఏడబ్ల్యూ.. డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2023 డిసెంబర్ నాటికి 350 మంది ఇంజినీరింగ్ నిపుణులను రిక్రూట్ చేయబోతున్నట్లు ఈ కంపెనీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇండియా అంతటా కంపెనీ సేవలను విస్తరించే పనిలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త తరహా డ్రోన్ల తయారీ, డ్రోన్ టెక్నాలజీ సర్వీసులు ఈ స్టార్టప్​ కంపెనీ అందిస్తుంది. అందుకు అవసరమైన యంగ్​ ఇంజినీర్లతోపాటు సీనియర్ ఐటీ నిపుణులను ఆహ్వానిస్తోంది. వివిధ కంపెనీల్లో పని చేసి ఉద్యోగం కోల్పోయిన వారిలో.. టాలెంట్ ఉన్నోళ్లకు తమ కంపెనీలో అవకాశం కల్పిస్తామని ఈ కంపెనీ తెలిపింది. https://tsaw.tech/

సీఎల్ఎక్స్ఎన్ఎస్ కంపెనీ CLXNS:

సీఎల్ఎక్స్ఎన్ఎస్ స్టార్టప్ కంపెనీలో 700 మంది ఉద్యోగులను నియమించుకోవటానికి రెడీ అవుతుంది. ప్రాడెక్ట్ డెవలప్ మెంట్, ఇంజినీరింగ్ అండ్ డిజైన్, మార్కెటింగ్, డేటా అనాలసిస్ విభాగాల్లో ఈ రిక్రూట్ మెంట్ ఉందని స్పష్టం చేసింది కంపెనీ. ఆన్ లైన్ సర్వీస్ సొల్యూషన్స్ విభాగంతోపాటు.. మిడ్ లెవల్ లో ఈ నియామకాలు ఉంటాయని వివరించింది కంపెనీ. ఈ ఏడాదిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని.. కంపెనీ ప్రాజెక్టుల ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే ఆలోచన చేస్తున్నామని కూడా తెలిపింది కంపెనీ. https://www.clxns.in/career

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!