Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSసెంట్రల్​ జాబ్స్​.. 5569 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

సెంట్రల్​ జాబ్స్​.. 5569 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (https://ssc.nic.in/) నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ (SSC Job Notification) విడుదల చేసింది. మొత్తం 5,569 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, అకౌటెంట్‌, రీసెర్చి ఇన్వెస్టిగేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సోమవారం.. అంటే మార్చి 6న ప్రారంభించింది కమిషన్. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.

Advertisement

విద్యార్హతలు:
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించింది సంస్థ. పోస్టుల ఆధారంగా.. టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్‌ విద్యార్హత పొందిన వారు అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://ssc.nic.in/

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 6
దరఖాస్తుకు ఆఖరి తేదీ: మార్చి 27
దరఖాస్తు ఫీజు కు చెల్లింపునకు గడువు: మార్చి 28, రాత్రి 11 గంటలు.
దరఖాస్తులకు ఎడిట్ అవకాశం: ఏప్రిల్ 3-5
ఎగ్జామ్: జూన్-జులై

Advertisement

అభ్యర్థుల ఎంపిక: డేటాఎంట్రీ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ కంప్యూటర్‌ పరీక్ష

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!