Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ ఎఫైర్స్ స్పోర్ట్స్​ ఫిబ్రవరి 2020

కరెంట్ ఎఫైర్స్ స్పోర్ట్స్​ ఫిబ్రవరి 2020

current-affairs-sports

స్పోర్ట్స్

3వ ఖేలో ఇండియా క్రీడలు

3వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనవరి 9 నుంచి 22 వరకు అసోంలోని గువహటి కరంబీర్ నబిన్ చంద్ర బార్డోలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్, అసోం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా వీటిని నిర్వహించాయి. ఇందులో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హర్యానా రెండు, ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. 7 గోల్డ్, 6 సిల్వర్, 8 బ్రాంజ్ మెడల్స్‌తో తెలంగాణకు 15వ ర్యాంక్‌ దక్కింది. ఏపీకి 22వ ర్యాంక్ లభించింది. అండర్–17, అండర్–21 రెండు కేటగిరీలలో క్రీడలను నిర్వహించారు.

ఇండోర్ క్రికెట్ కప్

11వ ఇండోర్ క్రికెట్ వరల్డ్ కప్‌ను అక్టోబర్ 10 నుంచి 17 వరకు ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నారు. 10 దేశాల క్రికెటర్లు ఇందులో పాల్గొననున్నారు. అండర్–21 పురుషులు, మహిళలు, ఓపెన్ కేటగిరి పురుషులు, మహిళలలు అనే 4 కేటగిరీలలో వరల్డ్ కప్‌ను నిర్వహించనున్నారు. ఇండోర్ క్రికెట్ వరల్డ్ కప్ తొలిసారి 1995లో ఇంగ్లాండ్‌లో జరిగింది.

భారత ఆర్చరీపై నిషేధం తొలగింపు

రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై 2019 ఆగస్టు 5న వరల్డ్ ఆర్చరీ విధించిన నిషేధాన్ని జనవరి 23న షరతులతో ఎత్తేశారు. నిబంధనల ప్రకారం జనవరి 18న ఎన్నికలు జరగడంతో నిషేధాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఎన్నికయ్యారు.

న్యూజిలాండ్‌లో వరల్డ్ కప్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2021 ఉమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్‌లో నిర్వహించనుంది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7వరకు న్యూజిలాండ్‌లోని అక్లాండ్, వెల్లింగ్టన్, హమిల్టన్, టౌరంగ, డ్యునెడిన్, క్రైస్ట్‌చర్చ్‌ నగరాలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌ క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. ఇందులో 8 జట్లు 31 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2017 వరల్డ్‌ కప్‌ను ఇంగ్లండ్ గెల్చుకుంది. ఇండియా ఈ టోర్నీకి 1978, 1997, 2013లలో ఆతిథ్యమిచ్చింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ జకోవిచ్‌దే

ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ను సెర్బియా ఆటగాడు నొవాక్ జొకొవిచ్ గెల్చుకున్నాడు. ఫిబ్రవరి 2న జరిగిన ఫైనల్లో ఐదో సీడ్ ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్‌పై గెలిచి కెరీర్‌‌లో ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు. దీంతో 8 కంటే ఎక్కువసార్లు గెలిచిన మూడో ప్లేయర్‌‌గా రఫెల్ నడాల్(12), రోజర్ ఫెడరర్(8) సరసన జొకొవిచ్ చేరాడు. ఈ విజయంతో జొకొవిచ్‌కు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ దక్కింది. మెన్స్ డబుల్స్‌లో రాజీవ్‌రాయ్‌(యూఎస్‌ఏ), జోసాలిస్ బరి(బ్రిటన్‌)లు ఫుర్సెల్‌–సావెల్లి(ఆస్ట్రేలియా) పై గెలిచి విజేతలుగా నిలిచారు.

మహిళల సింగిల్స్ విజేత కెనిన్

ఆస్ట్రేలియన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా ప్లేయర్ సోఫియా కెనిన్ గెల్చుకుంది. ఫిబ్రవరి 1న జరిగిన ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజాను ఓడించి టైటిల్ సాధించింది. గత పన్నేండేండ్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ గెలిచిన యంగెస్ట్ ప్లేయర్‌‌గా 21 ఏళ్ల కెనిన్ రికార్డు సృష్టించింది. 20 ఏళ్ల వయసులో మరియా షరపోవా, గతేడాది నవోమి ఒసాకా(21ఏళ్లు) విజేతలుగా నిలిచారు.( కెనిన్ ఒసాకా కంటే 22 రోజులు చిన్నది.) మహిళల డబుల్స్‌లో తిమియ బాబోస్‌(హంగేరీ),క్రిస్టినా మోడనోవిక్(ఫ్రాన్స్‌) విజేతలుగా నిలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బార్బరా క్రెజ్‌కోవా( చెక్‌రిపబ్లిక్‌), నికోరా మెక్టిక్‌(క్రొయేషియా) విజేతలుగా నిలిచారు.

36వ జాతీయ క్రీడలు

గోవా రాజధాని పనాజీ వేదికగా అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4వరకు 36 జాతీయ క్రీడలు జరగున్నాయి.  24 వేదికలలో 37 క్రీడలను నిర్వహించనున్నారు. 1200 క్రీడాకారులు పాల్గొననున్న ఈ క్రీడల మస్కట్‌గా గోవా రాష్ట్రపక్షి ‘రుబిగులా పక్షి’ ని ప్రకటించారు. ఈ మస్కట్‌ను గోవాకు చెందిన కార్టూనిస్ట్ షర్మిల కౌటిన్హో రూపొందించారు. 35వ జాతీయ క్రీడలు కేరళలో జరిగాయి. 37వ జాతీయ క్రీడలు చత్తీస్‌గఢ్‌లో నిర్వహించనున్నారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!