Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ అఫైర్స్ వ్యక్తులు‌‌–అవార్డులు (ఫిబ్రవరి 2020)

కరెంట్ అఫైర్స్ వ్యక్తులు‌‌–అవార్డులు (ఫిబ్రవరి 2020)

persons-awards-current-affairs

Advertisement

వ్యక్తులు

శక్తి కాంతాదాస్

బ్యాంకర్ మాగజైన్ ప్రకటించిన ‘సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డు భారత రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతాదాస్‌కు దక్కింది. ఆసియా విభాగంలో ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సుస్థిర ఆర్థికవృద్ధి, వ్యవస్థల ఏర్పాటు కోసం కృషి చేసినందుకు సత్కరించింది. ఇందులో భాగంగా అందించే ‘గ్లోబర్ సెంటర్ బ్యాంకర్ అవార్డు’ సెర్బియా బ్యాంక్ గవర్నర్ జోర్గావంక టబకొనికి లభించింది.

నారాయణరెడ్డి

తొలితరం తెలంగాణ వాది, మాజీ పార్లమెంట్ సభ్యుడు నారాయణ రెడ్డి ఫిబ్రవరి 2న అనారోగ్యంతో మరణించారు. 1967లో నిజామాబాద్​ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది పార్లమెంట్‌లో తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. ఈయన 1972లో బోధన్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.

వినయ్‌మెహన్ క్వత్రా

1988 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ వినయ్‌ మోహన్ క్వత్రా నేపాల్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. మంజీవ్ సింగ్ పూరీ స్థానంలో వినయ్ బాధ్యతలు చేపట్టారు.

వినోద్ కుమార్ శుక్లా

సాహిత్య అకాడమీ గ్రహీత, ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు మాతృభూమి బుక్ ఆఫ్ దియర్ అవార్డు లభించింది. అనువాద రచన ‘ బ్లూ ఈజ్ లైక్ బ్లూ’ అనే పుసక్తంలో సాధారణ మనిషి ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

అల్బిన్ కుర్తి

కొసావో నాలుగో ప్రధానిగా అల్బిన్ కుర్తి నియామకమయ్యారు. 2019 జులైలో రాజీనామా చేసిన రముష్ హరదినాజ్ స్థానంలో కుర్తి బాధ్యతలు చేపట్టారు.

సౌరవ్ గంగూలీ

టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా టీమ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌ ఉండాలంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీని భారత ఒలింపిక్ సంఘం కోరింది. టోక్యో ఒలింపిక్స్‌ ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో జరగనున్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో సచిన్ టెండూల్కర్, షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహ్మాన్‌ ‘గుడ్‌విల్ అంబాసిడర్స్‌’గా వ్యవహరించారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!