Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSకంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్​ 2023

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్​ 2023

ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్సుల్లో ఉన్నతమైన ఉద్యోగం సాధించడానికి యూపీఎస్‌సీ నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(COMBINED DEFENCE SERVICES EXAMINATION (I) 2023) నోటిఫికేషన్​ విడుదలైంది. ఇందులో సెలెక్ట్​ అయిన అభ్యర్థులను శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో రిక్రూట్​ చేసుకుంటారు. మంచి వేతనంతో దేశానికి సేవలు అందించే ఛాన్స్​ అభ్యర్థుల సొంతమవుతుంది. భవిష్యత్తులో మరింత అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసుకున్న అవివాహిత పురుషులు, మహిళలు ఈ పరీక్షకు పోటీ పడవచ్చు.

ఖాళీలు వివరాలు

  1. ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్- 100
  2. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 22
  3. ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్- 32
  4. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌- 170
  5. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌- 17.

మొత్తం ఖాళీలు: 341


విద్యార్హత:
మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఏయిర్‌ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీలకు జనవరి 2, 2000 కంటే ముందు; జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీ పోస్టులకు జనవరి 2, 2000 కంటే ముందు, జనవరి 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1999 కంటే ముందు, జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.

ఇంటర్వ్యూ: ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కీలకం. పరీక్షతో సమానంగా ఈ విభాగానికీ 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.

ట్రైనింగ్​: అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడమీలో చేరినవాళ్లకు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైనవారికి పైలట్‌ శిక్షణ బీదర్‌, ఎలహంక, హాకీంపేటల్లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్‌, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌, ఏయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి. పరీక్ష ఏప్రిల్‌ 16న నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు www.upsconline.nic.in ఆన్​లైన్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!