హైదరాబాద్ లోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడీ–2023 నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 6వ తేదీన ఈ ఎంట్రన్స్ నిర్వహించనుంది. బీ ఈడీ (B.Ed Open and Distance Learning), స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ (B.Ed Special education) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తారు. బీఈడీ (ఓడీఎల్) కోర్సు రెండేళ్ల వ్యవధి ఉంటుంది.
తెలుగు మీడియంలోనే కోర్సు ఉంటుంది. బీఈడీ (ఎస్ఈ) రెండున్నరేళ్లు. ఇది తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలోనూ ఉంది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అభ్యర్థులు మే నెల 22వ తేదీలోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్లై చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ https://www.braouonline.in/
