తెలంగాణ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరో నోటిఫికేషన్ వెలువడింది. డిస్కంల పరిధిలో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల రిక్రూట్మెంట్ ప్రకటన విడుదలైంది. టీఎస్ఎన్పిడిసిఎల్ పరిధిలో 82 అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేసేందుకు శనివారం నోటిఫికేషన్ రిలీజైంది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జూన్ 27 నుండి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు డిస్కం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ కు చివరి తేదీ జూలై 11. ఆగస్ట్ 14న పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
టీఎస్ఎన్పీడీసీఎల్ లో 82 అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ నోటిఫికేషన్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS