HomeLATESTఐటీఐ మార్కులతో ఈసీఐఎల్‌లో 437 ఖాళీలు

ఐటీఐ మార్కులతో ఈసీఐఎల్‌లో 437 ఖాళీలు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ఏడాది ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్​ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 437 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 31 అక్టోబర్​ 2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ట్రైనింగ్​ ఏడాది ఉంటుంది.

సెలెక్షన్​: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిష్​ శిక్షణ నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్‌ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్‌, హైదరాబాద్ లో జరగుతుంది. మరిన్ని వివరాలకు www.ecil.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!