భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 8,113 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు: మొత్తం 8,113 పోస్టుల్లో కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: 1,736, స్టేషన్ మాస్టర్: 994, గూడ్స్ రైలు మేనేజర్: 3,144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్- 478, ఆర్‌ఆర్‌బీ బెంగళూరు- 496, ఆర్‌ఆర్‌బీ చెన్నై- 436, ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్- 758 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్/ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్‌లో ఇంగ్లీష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి. వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) సబ్జెక్టులు: జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), మ్యాథ్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు). మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.
రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సబ్జెక్టులు: జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు). మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు కేటాయించారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం www.indianrailways.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.