Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్​

ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్​

దేశంలోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి. తెలంగాణలో సికింద్రాబాద్ (ఆర్‌కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండలో ఆర్మీ స్కూల్స్​ ఉన్నాయి.

సబ్జెక్టులు: బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాల సబ్జెక్టులు చేసి ఉండాలి.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు, సీటెట్‌, టెట్‌ అర్హత తప్పనిసరి. వయసు ఏప్రిల్​ 1, 2024 నాటికి ఫ్రెషర్స్‌ 40 ఏళ్లలోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.

సెలెక్షన్​: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్​ 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.385 చెల్లించాలి. నవంబర్​ 23, 24లో పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 10న ఫలితాలు విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు www.awesindia.com వెబ్​సైట్లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!