రాష్ట్రంలో నిరుద్యోగులకు యువజన సర్వీసుల శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే జిల్లా కేంద్రాలలో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మార్చి 5న మహబూబ్‌నగర్, 6న ఖమ్మం జిల్లా కేంద్రాలలో జాబ్ మేళాలు నిర్వహించనుంది. జిల్లాల వారీగా జాబ్ మేళాలకు త్వరలోనే పూర్తి షెడ్యూలు విడుదల చేయనుంది.హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయింది. దాదాపు 60 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. అక్కడికక్కడే ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందించాయి. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఈ జాబ్ మేళాను ప్రారంభించారు. అదే వేదికపై మాట్లాడుతూ.. త్వరలోనే అన్ని జిల్లాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
జిల్లాల్లో జాబ్ మేళాలు.. 5న మహబూబ్‌నగర్, 6న ఖమ్మం
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS