రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను ఇకపై ఎంసెట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది (2022–-23) ప్రవేశాలను ఎంసెట్ ర్యాంకులతో భర్తీ చేయాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపిన వెంటనే వర్సిటీ అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి లేఖ రాసి ఎంసెట్లో చేర్చనున్నారు.
కొద్ది రోజుల్లో ఎంసెట్ నోటిఫికేషన్
మరికొద్ది రోజుల్లో ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నందున వర్సిటీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. త్వరలోనే అనుమతి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లను విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది.