పేపర్ లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిట్ విచారణలో తేలిన నిందితులను టీఎస్పీఎస్సీ నిర్వహించే తదుపరి పరీక్షలేవీ రాయకుండా డిబార్ చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొతం 37 మంది పేర్ల జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. వీరందరూ తదుపరి పరీక్షలేవీ రాయకుండా వీరందరినీ డీబార్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ వివరణ ఇచ్చుకునేందుకు రెండు రోజుల గడువు విధించింది. రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ సెక్రెటరీకి తమ వివరణ ఇచ్చుకోవచ్చని.. లేదంటే డిబార్ చేసిన నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది.
TSPSC DEBARRED LIST

