HomeLATESTటెన్త్ అర్హతతో భారీగా రైల్వే జాబ్స్.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్.. అప్లికేషన్ లింక్...

టెన్త్ అర్హతతో భారీగా రైల్వే జాబ్స్.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!

రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, బిలాస్ పూర్ (South East Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా అప్రంటీస్ ఉద్యోగాలను (Railway Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 548 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియను మే 3న ప్రారంభించారు. అప్లై చేసుకోవడానికి జూన్ 3ని ఆఖరి తేదీగా నిర్ణచింది సౌట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Advertisement

ఖాళీల వివరాలు:
మొత్తం 548 ఖాళీలు ఉంన్నాయి. ఇందులో కార్పెంటర్, COPA, డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్క్, స్టెనో (ఇంగ్లిష్), స్టెనో (హిందీ), వెల్డర్, వైర్ మెన్, డిజిటల్ ఫొటో గ్రాఫర్ తదితర ట్రేడ్ లలో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంకా.. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పలు వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అధికారిక వెబ్ సైట్: Link

విద్యార్హతలు: టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI/NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!