తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు పరీక్షల తేదీలను ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లలో అకౌంట్స్ ఆఫీసర్ (యూఎల్బీ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (యూఎల్బీ), సీనియల్ అకౌంటెంట్స్(యూఎల్బీ) పోస్టులకు ఆగస్టు 8వతేదీన సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. మిగతా వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించగలరు.

జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ షెడ్యూల్
జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 12 వ తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. సీబీఆర్టీ పద్ధతిలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. హాల్టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.
పరీక్షల షెడ్యూల్


పరీక్ష తేదీ సబ్జెక్ట్ పోస్టు కోడ్ నంబర్
12/9/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
ఇంగ్లిష్ (పీసీ 13)
13/9/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
బొటనీ (పీసీ 02, 03)
14/09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
ఎకనామిక్స్ (పీసీ 11, 12)
20/09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
మ్యాథ్స్ (పీసీ 19, 20)
21/09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
తెలుగు (పీసీ 24)
22/09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
ఫిజిక్స్ (పీసీ 21, 22)
కెమిస్ట్రీ (పీసీ 26, 27)
25/09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
కామర్స్ (పీసీ 9, 10)
26/ 09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
సివిక్స్ (పీసీ 6, 7, 8)
అరబిక్ (పీసీ 1)
27/09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
హిందీ (పీసీ 15)
29/09/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
హిస్టరీ (పీసీ 16, 17, 18)
సంస్కృతం (పీసీ 23)
03/10/2023 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
ఉర్దూ