లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ఎగ్జామ్ యథాతథంగా షెడ్యూలు ప్రకారం జరుగుతుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనరేట్ పరిధిలో ఖాళీగా ఉన్నలైబ్రేరియన్ పోస్టులకు టీఎస్పీఎస్సీ గత ఏడాది నవంబర్లోనే నోటిఫికేషన్ (నెం.30/2022) జారీ చేసింది.
ముందుగా ప్రకటించిన మేరకే మే 17వ తేదీన ఈ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. అదే రోజు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్ బేస్ట్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల ముందు నుంచి వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
