తెలంగాణ నార్తర్న్ డిస్కం (TNPDCL)లో వివిధ ఉద్యోగాల నియామక ప్రకటన విడుదలైంది. మొత్తం 100 పోస్టుల భర్తీ చేపట్టనుంది. జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఉత్తర తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. త్వరలోనే పూర్తి వివరాల నోటిఫికేషన్ ను సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులన్నీ రెగ్యులర్ ఉద్యోగాలు. (డిటైల్డ్ నోటిఫికేషన్ వెలువడగానే merupulu.com ద్వారా అప్డేట్ అందిస్తాం..)
