Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు పోస్టల్ (Indian Post) శాఖ మరో శుభవార్త చెప్పింది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ను విడుదల చేసింది. స్టాఫ్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 58 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తమిళనాడు సర్కిల్ లోని ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అంటే.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజులోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు లైట్, హెవీ మోటార్ వెహికిల్స్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ లేదా సంస్థ నుంచి టెన్త్ పాసైన అనుభవం ఉండాలి.

అభ్యర్థులకు ఎంపిక:
మొదట 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ టూ పరీక్ష మోటార్ మెకానిజం, డ్రైవింగ్ పై ప్రాక్టికల్ విధానంలో ఉంటుంది. స్టేజ్ 1లో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అనంతరం మెరిట్ లిస్ట్ తయారు చేసి తుది ఎంపిక చేపడతారు.

అభ్యర్థులు పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ నుంచి లేదా అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపి Senior Manager (JAG), Mail Motor Service, No.37, Greams Road, Chennai 600 006 చిరునామాకు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!