Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSకరెంట్​ అఫైర్స్​ ప్రాక్టీస్​ టెస్ట్ 1

కరెంట్​ అఫైర్స్​ ప్రాక్టీస్​ టెస్ట్ 1

current affairs test for all TSPSC Exams. టీఎస్​పీఎస్​సీ నిర్వహిస్తున్న అన్ని ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్​ బిట్​ బ్యాంక్​ టెస్ట్.. ప్రాక్టీస్​ చేయండి. విజయం సాధించండి.
(జవాబు కోసం ప్రశ్న పక్కన ఉన్న డౌన్​ యారో క్లిక్​ చేయండి)
1. సిరియా సరిహద్దు సమీపంలో టర్కీ (తుర్కియే) ఆగ్నేయ ప్రాంతంలో 2023, ఫిబ్రవరి 6న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై ఎంతగా నమోదైంది?

జ: 7.8

2. 2023, జనవరి 29, 30 తేదీల్లో భారత్‌లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 77వ సెషన్‌ అధ్యక్షులు ఎవరు?

జ: సాబా కొరొసి

3. కింది అంశాల్లో సరైంది?
ఎ) భారత్, ఈజిప్ట్‌ల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సంబంధాలను విస్తరించడం సహా సీమాంతర ఉగ్రవాదం నియంత్రణకు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది.
బి) వచ్చే అయిదేళ్లలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ.97,908 కోట్లకు (1200 కోట్ల డాలర్లు) పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.
సి) 2023 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సీసీ హైదరాబాద్‌ హౌస్‌లో 2023 జనవరి 25న ప్రధాని మోదీతో సమావేశమై ఒప్పందాలపై సంతకం చేశారు.
డి) హైదరాబాద్‌ హౌస్‌ హైదరాబాద్‌లో ఉంది.

జ: ఎ, బి, సి

4. ఏ దేశ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పెన్షన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆ దేశ చరిత్రలోనే అతి పెద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి? (అక్కడి ప్రభుత్వం పదవీ విరమణ వయసుని 62 నుంచి 64 కి పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.)

జ: ఫ్రాన్స్‌

5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇటీవల సైప్రస్, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించారు.
బి) భారత్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో సైప్రస్‌ 92వ సభ్య దేశంగా చేరింది. రెండు దేశాల మధ్య విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపారులు సులభంగా ప్రయాణించేందుకు అవసరమైన అవగాహన పత్రంపై సంతకాలు జరిగాయి. ఉభయ దేశాల మధ్య సైనిక సహకారానికి ఒప్పందం కుదిరింది.
సి) 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాను సందర్శించిన తొలి భారత విదేశాంగ మంత్రిగా జైశంకర్‌ వార్తల్లో నిలిచారు.
డి) ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేసే ‘వాసెనార్‌ అరేంజ్‌మెంట్‌’ ప్లీనరీ ఛైర్మన్‌గా భారత్‌ 2023, జనవరి 1న బాధ్యతలు చేపట్టింది.

జ.పైవన్నీ

6. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ ఛీఫ్‌ అబ్దుల్‌ రెహ్మన్‌ మక్కీని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఏ దేశం ప్రతిపాదించింది? (ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2023, జనవరి 16న మక్కీని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చింది.)
ఎ) భారత్‌ బి) అమెరికా
సి) చైనా డి) ఫ్రాన్స్‌

జ: ఎ, బి

7. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ భారత్‌లో తమ దేశ రాయబారిగా ఎవరిని పునర్నియమించారు?

జ: ఎరిక్‌ గార్సెట్టీ

8. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న భూభాగాన్ని దేశీయంగా రామసేతుగా, ఆడమ్స్‌ బ్రిడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీని మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌ ప్రాజెక్టు’ని నిర్మించాలని 2023, జనవరి 12న తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. సేతు సముద్రం ప్రాజెక్టును 1860లో అప్పటి మెరైన్‌ సర్వే అధిపతి, కమాండర్‌ ఏడీ టేలర్‌ ప్రతిపాదించారు. దీని సాధ్యాసాధ్యాలపై 1964లో వేసిన కమిటీ

జ: నాగేంద్ర సింగ్‌ కమిటీ

9. 14వ ఏరో ఇండియా ప్రదర్శన ఎక్కడ జరిగింది.

జ: బెంగళూరు

10. భారత్‌లోని ఏ ప్రముఖ సంస్థ ‘అన్‌ బాటిల్డ్‌’ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి యూనిఫామ్‌లను తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది? (ఇలా రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించిన ‘నద్రీ’ జాకెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించింది.)

జ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)

11. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాటి ఆధ్వర్యంలో నడిచే రవాణా, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎన్నేళ్లకు పైబడి సర్వీసులో ఉన్న 9 లక్షలకు పైగా వాహనాలను తుక్కుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 2023లో నిర్ణయించింది?

జ: 15 ఏండ్లు

12. ఎవరి హయాంలో దేశంలో ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) ప్రారంభమైంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ రఘురాం రాజన్‌

13. జోషీమఠ్‌ ఎక్కడ ఉంది

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో

14. కరోనా నియంత్రణకు ‘ఇన్‌కొవాక్‌’ అనే నాసికా (నాసల్‌) టీకాను అభివృద్ధి చేసింది. దీన్ని 2023, జనవరి 26న ఢిల్లీలో విడుదల చేశారు.

హైదరాబాద్‌కి చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ

15. కల్వరి శ్రేణి చివరిది, అయిదవ జలాంతర్గామి. ఫ్రాన్స్​ పరిజ్ఞానంతో తయారై 2023, జనవరి 23న భారత నేవీలో చేరిన జలాంతర్గామి.

ఐఎన్‌ఎస్‌ వాగీర్‌

16. వాగీర్‌ అంటే..

ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్‌ చేప

17. రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ

జ: అనిల్‌ కుమార్‌ లహోటి

18. ప్రతిష్ఠాత్మక ‘ఫార్ములా ఈ ఛాంపియన్‌ షిప్‌ కార్‌ రేసింగ్‌’ పోటీలు ఎక్కడ జరిగాయి. ఛాంపియన్​ ఎవరు?

హైదరాబాద్​ హుస్సేన్​సాగర్​ తీరంలో జరిగాయి. ​డీఎస్‌ పెన్‌స్కీ టీమ్‌కి చెందిన జిన్‌ ఎరిక్‌ వెర్న్‌ ఛాంపియన్​గా నిలిచాడు.

19. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ (గతంలో నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా ఎవరు నియమితులయ్యారు?

జ: ప్రసన్న కుమార్‌ మోటుపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన వాడు

20. 65వ గ్రామీ పురస్కారాలను గెలుచుకున్న బెంగళూరుకి చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌

జ: రికీ కేజ్‌ గ్రామీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అమెరికా రాక్‌ లెజెండ్‌ స్టీవర్డ్‌ కోప్లాండ్‌తో కలిసి రికీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వీరు రూపొందించిన ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కి బెస్ట్‌ ఇమాజివ్‌ ఆడియో ఆల్బమ్‌ విభాగంలో ఈ అవార్డు లభించింది. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డును రికీ కేజ్‌ గెలుచుకోవడం ఇది మూడోసారి.

21. ప్రపంచంలో అత్యంత తెలివైన విద్యార్థినిగా వరుసగా రెండో ఏడాది ఘనత సాధించిన భారతీయ-అమెరికన్‌ ఎవరు?

జ: నటాషా పెరియనాయగమ్‌

22. చిరుధాన్యాలకి సంబంధించి ‘గ్రాస్‌ రూట్స్‌ అంబాసిడర్‌’

జ: లహరి బాయి. మధ్యప్రదేశ్‌లోని దిందోరి జిల్లా శిల్పడి గ్రామానికి చెందిన ఈ 27 ఏళ్ల మహిళ అరుదైన విత్తనాలను సేకరించి, తన ఇంటినే ‘విత్తనాల బ్యాంక్‌’గా మార్చింది. చుట్టు పక్కల గ్రామాల్లో చిరుధాన్యాల గురించి ప్రచారం చేసి, వాటిని ఉచితంగా అందిస్తోంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!