గ్రూప్ 3 (TSPSC GROUP 3) పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టుల తరహాలోనే గ్రూప్ 3 పోస్టులకు పోటాపోటీ నెలకొన్నట్లు స్పష్టమైంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా మొత్తం 1375 గ్రూప్ 3 పోస్టులకు టీఎస్పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ గురువారం సాయంత్రం వరకు అప్లికేషన్ల గడువు ముగిసింది. గడువులోపు మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. అప్లికేషన్ల సంఖ్యను బట్టి ఒక్కో గ్రూప్ 3 పోస్టుకు 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
