HomeFeaturedEAMCETరేపే టీఎస్​ ఎంసెట్​ నోటిఫికేషన్​.. ఇంటర్​ వెయిటేజీ.. సిలబస్ పై కీలక నిర్ణయం

రేపే టీఎస్​ ఎంసెట్​ నోటిఫికేషన్​.. ఇంటర్​ వెయిటేజీ.. సిలబస్ పై కీలక నిర్ణయం

తెలంగాణ ఎంసెట్​ నోటిఫికేషన్​ శుక్రవారం (ఈనెల 24న) వెలువడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేయనున్నట్లు హైదరాబాద్​ జేఎన్​టీయూ కన్వీనర్​ దీన్​ కుమార్​ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఇంజనీరింగ్​, ఫార్మసీ, అగ్రికల్చర్​ డిగ్రీలో చేరేందుకు నిర్వహించే ఎంసెట్​ను ఈసారి జేఎన్​టీయూ నిర్వహిస్తుంది. ఇంటర్​ మార్కుల వెయిటేజీ ఉంటుందా.. లేదా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ ఫస్టియర్​లో వంద శాతం, సెకండియర్​లో 70 శాతం సిలబస్ ఆధారంగా ఈసారి ఎంసెట్​ పరీక్షను రూపొందించనున్నారు.

కొవిడ్​ ఎటాక్​ తర్వాత ఇంటర్​ మార్కుల వెయిటేజీ లేకుండా ఎంసెట్​లో వచ్చే మార్కుల మెరిట్​ ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్​ సీట్లను అలాట్​ చేస్తున్నారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా ఇంటర్​ మార్కుల వెయిటేజీని తొలిగించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా గవర్నమెంట్​ కాలేజీల్లో ఇంటర్​ చదివే విద్యార్థులకు ఈ నిర్ణయం మేలు చేయనుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!