పోలీస్ రిక్రూట్ మెంట్ వివాదంపై తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) వెనక్కి తగ్గింది. ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ ఎత్తుతో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థుకు మరోసారి ఫిజకల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 8 నుంచి జనవరి 5 వరకు నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్‌లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థులు ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో టీఎస్ఎల్పీఆర్బీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సెంటీ మీటర్, అంతకంటే తక్కువ ఎత్తులో క్వాలిఫై కాని అభ్యర్థులకు మరో మంచి ఛాన్స్ దొరికినట్లయింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని రెండు గ్రౌండ్లలో వీరికి రీమెజర్మెంట్ నిర్వహిస్తారు.
